“కేసీఆర్” కు మరో షాక్… మాజీ ఎమ్మెల్సీ రాజీనామా !

-

తెలంగాణాలో జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని నిన్న సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ ఎన్నికల్లో BRS తరపున పోటీ చేస్తున్న వారికి బి ఫామ్ లను కూడా పంపిణీ చేశారు. ఎవరికి అయితే అంచనాలు పెట్టుకుని బి ఫార్మ్ రాలేదో వారిలో కొందరు కేసీఆర్ షాక్ ఇవ్వడానికి రెడీ అవ్వగా కొందరు ఇప్పటికే ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత BRS పార్టీకి రాజీనామా చేశారు. వాస్తవంగా నిజామాబాద్ అర్బన్ టికెట్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న లలితకు కేసీఆర్ మొండి చెయ్యి చూపడంతో ఇక కుదరదని ఈమె ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ప్రస్తుతం BRS లో లలిత తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పెర్సన్ గా ఉన్నారు. లలిత గతంలో కాంగ్రెస్ తరపున ఆర్మూరు నుండి పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తరువాత BRS లో చేరడంతో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version