టీడీపీకి షాక్‌.. మ‌రో సీనియ‌ర్‌ నేత‌ రాజీనామా..

-

టీడీపీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ, కర్నూలు జిల్లా కీలకనాయకుడు సుధాకర్‌ బాబు టీడీపీకి రాజీనామా చేశారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఏ పార్టీలో చేరేదీ త్వరలో వెల్లడిస్తానన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారం కోల్పోయాక టీడీపీ అధినేత చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు.

రాజకీయ అవసరాల కోసం ప్రజల కుల, మత చిచ్చుపెట్టడంలో అర్ధం ఏమిటని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చాక దేవస్థానాల్లో క్రైస్తవులు పెరిగిపోయారని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని సుధాకర్‌బాబు అన్నారు. జనసేనాని పవన్‌కు పిచ్చి పట్టిందని, రాజకీయాల్లో ఓనమాలు తెలియని పవన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version