కరోనా టైమ్ లో మోడీ 16వేల కోట్లతో విమానాలు కొనుకున్నారు : మాజీ కేంద్రమంత్రి

-

మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ కేంద్రప్రభుత్వం పై, రాష్ట్ర ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. బీజీపీ పాలనలో పెట్రోల్ , డీజీల్ , నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని చింతా మోహన్ అన్నారు. కరోనా విఫత్కర పరిస్థితుల్లో ప్రదాని మోదీ 16 వేల కోట్లు ఖర్చు చేసి రెండు విమానాలు కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ దేశ అభివృద్దిని అమ్ముకుంటున్నారు… భారత దేశంలో సోషలిజాన్ని అమ్మి క్యాప్టలిజాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ex MP chintha mohan comments

ఏపీలో దొంగ నోట్లు వేయించుకుని వైసీపీ ఎన్నికల్లో గెలుస్తున్నారు అంటూ ఆరోపించారు. చంద్రబాబు సొంత ఓట్లు కూడా వేయించుకోలేని పరిస్థితి ఏపీలో ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 80 లక్షల ఎస్సీ ,ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు సంక్రాంతి లోపు స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి..ఎస్సీ పైనాన్స్ కార్పోరేషన్ వెంటనే పునరుద్ధరించాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలి అంటూ చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version