Bigg Boss 5 Telugu: కెప్టెన్సీ టాస్కా.. మాజాకా..! స్నేహితుల మ‌ధ్య చిచ్చు .. కాజల్‌, మానస్‌లపై మండిపడ్డ సన్నీ..

-

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ టాస్కులు మామూలుగా ఉండ‌వ్ బాబోయ్.. ఎవరిని ఎప్పుడూ టార్గెట్ చేస్తాడో..? ఎవ‌రితో ఎలా ఆడిస్తాడో? ఎవరికీ అర్థం కాదు. బిగ్ బాస్ త‌లుచుకుంటే.. బ‌ద్ద‌ శత్రువులు అనుకుంటే వాళ్ల‌ను.. ఇట్టే కలిసిపోయేలా చేస్తాడు. అలాగే ప్రాణ‌ స్నేహితులు అనుకున్నవాళ్లే మ‌ధ్య అనూహ్యంగా గొడవలు సృష్టిస్తాడు. ఇదే విష‌యం మ‌రోసారి రుజువైంది.

మానస్, సన్నీలు బిగ్ బాస్ కి రాకముందు సీరియల్స్ నుంచి కూడా స్నేహితులు. బిగ్ బాస్ కి వచ్చాక కూడా ఆ స్నేహాన్ని అలానే కొనసాగిస్తూ ఇద్దరూ కలిసి గేమ్ ఆడుతున్నారు. వీరిద్ద‌రూ గేమ్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇప్పటివరకు ఒక్క‌రికొక్క‌రూ హెల్ప్ చేసుకుంటూ.. టాస్కుల్లో త‌మ బెస్ట్ ఇవ్వ‌డానికి ట్రై చేస్తారు. తాజాగా బిగ్ బాస్ వీళ్ళిద్ద‌రి మ‌ధ్య చిచ్చు రాచేశాడు. అందులో సిరి ఆజ్యం పోసింది.

నిన్న జ‌రిగిన ఎపిసోడ్ లో మీ ఇళ్లు బంగారం కాను` టాస్క్ కంటిన్యూ అయ్యింది. ఇంటి సభ్యులు గేమ్‌ గురించి రకరకాలుగా చ‌ర్చలు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఆ త‌రువాత‌త కెప్టెన్సీ కంటెండర్స్‌ ఎంపిక కోసం బిగ్‌బాస్‌ రెండు టాస్క్‌లు పెట్టాడు. మొద‌టి గేమ్ బెలూన్స్ పగలగొట్టే టాస్క్ . రెండ‌వ‌ది స్విమ్మింగ్‌ పూల్ అండ్ టీ షర్ట్‌ టాస్క్‌.

మొదటి టాస్క్‌లో ల‌వ్ బ‌ర్డ్స్ పింకీ- మాన‌స్ త‌ల‌ప‌డ్డారు. ఎప్పటిలాగానే ఈ గేమ్‌లో సన్నీ మానస్‌కు మద్దతుగా నిలిచాడు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో మాన‌స్ త‌న‌కు ద‌క్కిన గొడ్డ‌లిని స‌న్నీకి ఇచ్చాడు.
దీంతో స‌న్నీని క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచి బిగ్‌బాస్ అత‌డికి ఒక స్పెష‌ల్ ప‌వ‌ర్ ఇచ్చాడు. ఒక‌రి నుంచి స‌గం బంగారు ముత్యాల‌ను తీసుకుని ఇంకొక‌రికి ఇవ్వాలని చెప్పాడు. దీంతో స‌న్నీ, సిరి ద‌గ్గ‌ర నుంచి గోల్డ్‌ను తీసుకొని ష‌ణ్ముఖ్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత మొద‌టి రౌండ్‌లో ఎక్కువ బంగారం సంపాదించిన ప్రియాంక‌, మాన‌స్‌ల‌కు బెలూన్ టాస్క్ ఇవ్వ‌గా అందులో ప్రియాంక గెలిచింది.

ఈ టాస్క్ తరువ‌వా ఎక్కువ గోల్డ్ గుండ్లు సాధించిన వారిలో సిరి, సన్నీ టాప్‌లో నిలిచారు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య కెప్టెన్సీ టాస్క్ పెట్టాల‌ని బిగ్ బాస్ నిర్ణ‌యించారు. అందులో భాగంగా స్విమ్మింగ్‌ పూల్ అండ్ టీ ష‌ర్స్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. బజర్‌ మోగే వరకు ఎవరు ఎక్కువ టీషర్ట్ ధరిస్తారో వాళ్లు కెప్టెన్సీ పోటీదారులకు అర్హత సాధించిన‌ట్టని బిగ్ బాస్ తెలిపారు.

ఈ టాస్క్లో సన్నీ, సిరి పోటీ పడాల్సిఉండే.. కానీ సిరి ఇక్క‌డే ఓ త‌న ఫ్లాన్ అమలు చేసింది. స్విమ్మింగ్‌ చేయడం ఇబ్బంది ఉందని, తన స్థానంలో మరొకరు టాస్క్ లో పాల్గొనే అవకాశం ఉందా? సంచాల‌కుడు ర‌విని అడిగింది. సిరి కోరిక‌ను బిగ్ బాస్ ఒప్పుకున్నారు. ఈ టాస్క్లో త‌న తన తరఫున పోటీలో పాల్గొనేందుకు ష‌న్నును పంపిస్తుంద‌ని అంద‌రూ భావించారు కానీ, అనూష్యంగా మాన‌స్ ను తెర‌మీదికి తీసుకవ‌చ్చింది. ఇన్ డైరెక్ట్ గా స‌న్నీ గేమ్ ని ఆగం చేయడానికి సిద్ద‌మైంది.

త‌న స్ట్రాట‌జీ ప్ర‌కార‌మే.. సిరి త‌న స్థానంలో మానస్ పంపింది. ఈ టాస్క్లో సన్నీనే మాన‌స్ కంటే వేగంగా స్వీమింగ్ చేసి.. ఎక్కువ టీషర్ట్స్ ధరించాడు. కానీ తాను వేసుకున్న టీషర్ట్స్ కు స‌రైన లేబుల్ లేద‌నే కార‌ణంతో ఐదు ఫెయిల్‌ అయ్యాయి. దీంతో 22 టీషర్ట్ లను ప్రాపర్‌గా ధరించిన మానస్‌ విజేతగా నిలిచాడు.

ఈ విషయంలో గొడవ ప్రారంభమైంది. సన్నీ తన వాదననే వినిపిస్తూ వచ్చాడు. దీంతో మరోసారి మానస్‌, కాజల్‌, ప్రియాంకలు ఆయన్ని సముదాయించే ప్రయత్నం చేయగా, అలానే ఫైర్‌ అవుతున్నాడు.
అయితే ఈ గేమ్ లో రూల్స్ త‌న‌కు ముందే స‌రిగా చెప్ప‌లేదంటూ ర‌వి మీద ఫైర్ అయ్యాడు స‌న్నీ. ప్రతిసారి తననే ఇలా చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రవి చెప్పినా వినలేదు. కాజల్‌ చెప్పే ప్రయత్నం చేసినా అస‌లూ ప‌ట్టించుకోలేదు.

ఫ్రెండ్స్ కూడా ఇలా చేస్తారా? అంటూ మానస్‌ని ఉద్దేశించి మండిపడ్డాడు సన్నీ. ఆ త‌రువాత తన కోపాన్ని త‌గ్గించుకునేందుకు స‌న్నీ స్విమ్మింగ్ పూల్‌లో దూకాడు. ఇలా సన్నీ.. మానస్, కాజల్ తో ఈ కెప్టెన్సీ టాస్కులో గొడవ పడ్డాడు బిగ్ బాస్. సిరి కూడా కావాలంటే.. త‌న త‌రుఫున మాన‌స్ ను పంపించిందనీ భావిస్తున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. మరి సిరి, షన్ను లాగా మళ్ళీ వెంటనే కలిసిపోతారా? లేదా సన్నీ త‌న‌ కోపాన్ని అలాగే కొన‌సాగిస్తాడా.. అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version