హ్యాపీ బర్త్‌డే బావా…!

-

తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఎందరో ఆయనకి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అలాగే రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ…హ్యాపీ బర్త్‌డే బావా అని పేర్కొన్నారు. సంతోష్‌కుమార్‌ తన ట్వీట్ లో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటాల్సిందిగా హరీశ్‌ను కోరారు. పుట్టినరోజును పురస్కరించుకుని మరో మూడు మొక్కలకు జీవితాన్నిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, ఇతర రంగాల ప్రముఖులు పెద్దఎత్తున మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ హరీశ్‌రావు పూర్తి ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news