గుంటూరు జిల్లాలో ఎక్సైజ్ పోలీసుల దాష్టీకం.. యువకుడి ఆత్మహత్య.. ఉద్రిక్తత

-

గుంటూరు: ఎక్సైజ్ పోలీసుల దాడికి గురైన షేక్ అలిషా (28) మృతి చెందారు. ఎక్సైజ్ పోలీసుల తీరుతో మనస్థాపం చెందిన అలిషా పురుగు మందు తాగారు. దాచేపల్లి మండలం భట్రుపాలెం వద్ద యువకుడుపై ఎక్సైజ్ పోలీసుల దాడి చేశారు. కారులో మద్యం సరఫరా చేస్తున్నారని యువకులను ఎక్సైజ్ పోలీసులు ఇబ్బంది పెట్టారు. తమ వద్ద మద్యం లేదని చెప్పినా వినకుండా యువకులపై పోలీసులు దాడి చేశారు.

దాడికి గురైన ఇద్దరు యువకులలో అలిషా పురుగు మందు తారు. జీసీహెచ్‌లో చికిత్స పొందుతూ అలిషా మృతి చెందారు. అలిషా మృతిపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో భట్రుపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎక్సైజ్ పోలీసుల తీరును నిరసిస్తూ యువకుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అలిషా మృతి కారణమైన ఎక్సైజ్ పోలీసులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version