ప్రస్తుతం అమెరికాలో లిక్కర్ బాటిల్ మిస్టరీ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో మాజీ అధికారి జైలుకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే, అమెరికా మాజీ విదేశాంగ అధికారి మైక్ పాంపియో జపాన్ పర్యటించినపుడు, అక్కడి ప్రభుత్వం 4లక్షల రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్ బహుమతిగా ఇచ్చింది. ప్రస్తుతం ఆ బాటిల్ కనిపించడం లేదు. అమెరికా నియమాల ప్రకారం ఇతర దేశాలకు వెళ్ళినపుడు అక్కడి వారు ఇచ్చిన బహుమతులను సొంతానికి వాడుకోరాదు.
25వేల రూపాయలకు తక్కువ విలువ ఉన్న వాటిని వాడుకోవచ్చు. అంతకంటే ఎక్కువ విలువ ఉన్నవాటిని వాడుకోవడానికి వీల్లేదు. దీంతో ప్రస్తుతం మాజీ అమెరికా విదేశాంగ అధికారి చిక్కుల్లో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. కనిపించని మద్యం బాటిల్ ఎక్కడ ఉంది? దాని ఏం చేసారు? అనే విషయాలు తొందరలో తెలియకపోతే మాజీ అధికారి జైలుకు వెళ్ళవచ్చని వార్తలు వస్తున్నాయి.