అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి. కాసేపటి వరకు వెనుకబడి ఉన్న డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారీస్ అనుహ్యంగా పుంజుకున్నారు. డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే ఆమె కేవలం 20 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు 230 ఎలక్టోరల్ ఓట్లు పోలవ్వగా.. హారిస్‌కు 210 ఓట్లు పోలయ్యాయి.
ఒకానొక దశలో 100 ఓట్ల వెనుకంజలో ఉన్న హ్యారీస్‌ను కాలిఫోర్నియా, హవాయి, వర్జీనియా, నెబ్రాస్కా, న్యూ మెక్సికో, వాషింగ్టన్ రాష్ట్రాలు ఆదుకున్నాయి. ఇక నార్త్ కరోలినాను దక్కించుకోవడంతో వైట్‌హౌస్‌కు ట్రంప్ మార్గం సుగమం అయ్యిందని తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వలంటే ఆయనకు ఇంకా 42 ఓట్లు అవసరం పడుతుంది. 270 మార్క్ దాటితే రెండోసారి ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడు కానున్నారు.