అదిరిపోయే స్కీమ్.. రూ.411 ఇన్వెస్ట్ చేస్తే,రూ.66 లక్షలు పొందే అవకాశం..

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తూ వస్తుంది.ఈ మేరకు అమ్మాయిల భవిష్యత్తుకు రక్షణ కల్పించేందుకు అద్భుతమైన స్కీమ్ ను తీసుకొని వచ్చింది.అదే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌..2016 లో ఈ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకోని వచ్చారు.పై చదువులకు వివాహాలకు ఉపయోగపడేలా పథకాన్ని రూపొందించింది. లబ్ధిదారులకు ఈ పథకం కింద ప్రభుత్వం అధిక వడ్డీని అందిస్తోంది. విడతలవారీగా నగదు డిపాజిట్‌ చేస్తూ మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తంలో నగదును అందుకోవచ్చు. రోజుకు రూ.411 ఇన్వెస్ట్‌ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో రూ.66 లక్షల భారీ మొత్తాన్ని అందుకొనే అవకాశం ఉంది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి అర్హతలు, ఇతర ప్రయోజనాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ స్కీమ్లో.. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల పేరిట సుకన్య సమృద్ధి అకౌంట్‌ను ఓపెన్‌ చేయవచ్చు. పోస్టాఫీసులలో, సూచించిన కమర్షియల్‌ బ్యాంకులలో అకౌంట్‌ను ఓపెన్‌ చేసుకొనే అవకాశం ఉంది. సుకన్య సమృద్ధి అకౌంట్‌పై సంవత్సరానికి 7.6 శాతం వడ్డీ అందుతోంది. 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఈ వడ్డీ అమలవుతుంది. ఈ పథకం కింద వార్షిక ప్రాతిపదికన వడ్డీని లెక్కిస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో సుకన్య సమృద్ధి అకౌంట్‌లో కనీసం రూ.250, గరిష్టంగా రూ.1,50,000 డిపాజిట్‌ చేయవచ్చు. రూ.50 మల్టిపుల్స్‌లో నగదును డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఒక నెలలో లేదా ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన డిపాజిట్ల సంఖ్యపై లిమిట్‌ లేదు..

ఆడపిల్ల పేరిట సుకన్య సమృద్ధి అకౌంట్‌ను ఓపెన్‌ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో వడ్డీతో కలిపి నగదును అందుకోవచ్చు. ఆడపిల్లకు 21 సంవత్సరాలు వచ్చినప్పుడు నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒక సంవత్సరంలో రూ.1.5 లక్షల పన్ను రహిత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేస్తే.. 15 సంవత్సరాలలో మొత్తం రూ.22,50,000 డిపాజిట్‌ చేసినట్లు అవుతుంది. అంటే రోజుకు సుమారు రూ.411 కేటాయించాలి. ఆడపిల్లకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ.65,93,071 పొందవచ్చు..

ఇకపోతే సుకన్య సమృద్ధి అకౌంట్‌లో డిపాజిట్‌ చేసిన మొత్తానికి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ట్యాక్స్‌ డిడక్షన్స్‌ లభిస్తాయి. అదే విధంగా సుకన్య సమృద్ధి అకౌంట్‌లో సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్‌ డిడక్షన్‌ పొందవచ్చు…

Read more RELATED
Recommended to you

Exit mobile version