మన ‘లోకం’ exclusive : దారుణమైన రేప్ నుంచి మెడచుట్టూ ఉరితాడు వరకూ .. !!

-

సరిగ్గా డిసెంబర్ 16,  2012 వ సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో నడిబొడ్డున నిర్భయ అత్యాచారం హత్య ఘటన జరిగింది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో భారత్ పై విమర్శలు వచ్చాయి. అదే టైంలో యూపీఏ సర్కారు అధికారంలో ఉన్న నేపథ్యంలో ….పార్లమెంటులో నిర్భయ ఘటన పై అధికారం మరియు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం జరిగింది. చివరాఖరికి నిర్భయ అనే చట్టాన్ని కాంగ్రెస్ హయాంలో వచ్చింది. Image result for nirbhaya caseఇదిలా ఉండగా ఆ చట్టం వచ్చినా గానీ ఈ కేసులో నలుగురు నిందితులను దాదాపు 8 సంవత్సరాల పాటు ఉరిశిక్ష పడలేదు. తాజాగా ఇటీవల ఉదయం హత్య కేసులో నలుగురు దోషులకు తీహార్ జైలు నెంబర్ 3లో ఉరి శిక్షను అమలు చేశారు. దేశమంతా సంబరాలు నెలకొన్నాయి. అసలు కేసు మొత్తం క్షుణ్నంగా పరిశీలిద్దాం. 16 డిసెంబర్ 2012 – ఢిల్లీలో ఒక పారామెడికల్ విద్యార్థినిపై ఆరుగురు కలిసి కదులుతున్న బస్సులో అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం ఆమెను, ఆమె స్నేహితుడిని బస్సులోంచి తోసేశారు. వీరిని ఢిల్లీలోని సర్థఫ్‌గంజ్ ఆసుపత్రిలో చేర్చించారు.

 

డిసెంబర్ 29 – పూర్తి అపస్మారక స్థితిలో ఉన్న నిర్భయ సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్‌లో మర్డర్ చార్జెస్ అదనంగా చేర్చారు. ఇంత అత్యంత దారుణమైన రేప్ నుంచి నిందితులకు మెడ చుట్టూ వరకు ఉరిశిక్ష ప్రయాణం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.

2 జనవరి 2013 – అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి అల్తమాస్ కబీర్ లైంగిక దాడుల కేసులకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు.

ఆగస్టు 31 – జువేలియన్ జస్టీస్ బోర్డు నిందితుల్లోని మైనర్‌ను దోషిగా తేల్చి మూడేండ్లు ప్రొబేషన్ హోమ్‌లో ఉండాలని తీర్పు చెప్పింది.

సెప్టెంబర్ 10 – ఈ కేసులో నిందితులైన ముఖేష్, వినయ్, అక్షయ్, పవన్‌లను దోషులుగా నిర్థారిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పింది.

సెప్టెంబర్ 13 – ఢిల్లీ కోర్టు వీరందరికీ ఉరి శిక్షను విధించింది.

13 మార్చి 2014 – కింది కోర్టు ఇచ్చిన మరణ శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది.

మార్చి 15 – సుప్రీంకోర్టు తొలుత ఇద్దరు దోషులకు, తర్వాత మిగిలిన ఇద్దరు దోషులకు విధించిన శిక్షపై స్టే విధించింది.

3 ఫిబ్రవరి 2017 – ఈ కేసులో మళ్లీ మొదటి నుంచి వాదనలు వింటామని సుప్రీంకోర్టు చెప్పింది.

మే 5 : సుప్రీంకోర్టు నలుగురు దోషులకు మరణ శిక్షను ఖరారు చేసింది. ఇది చాలా అరుదైన కేసని వ్యాఖ్యానించింది.

నవంబర్ 8 – నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ తనకు విధించిన మరణ శిక్షపై రివ్యూ పిటిషన్‌ను సుప్రీంలో దాఖలు చేశాడు.

డిసెంబర్ 15 – మరో ఇద్దరు దోషులు వినయ్ శర్మ, పవన్ కుమార్ గుప్తాలు కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు

జులై 9 – సుప్రీంకోర్టు ముగ్గురి రివ్యూ పిటిషన్లను కొట్టేసింది.

ఫిబ్రవరి 2019 – దోషులకు వెంటనే డెత్ వారెంట్లు జారీ చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు

10 డిసెంబర్ 2019 – తన మరణ శిక్షపై అక్షయ్ కుమార్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు.

డిసెంబర్ 18 – అక్షయ్ రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దోషులు తమకు మిగిలి ఉన్న అన్ని న్యాయపరమైన హక్కులను ఉపయోగించుకోమని చెప్పమని తీహార్ జైలు అధికారులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది.

డిసెంబర్ 19 – నేరం జరిగిన సమయంలో తాను మైనర్‌ని అని శిక్షను తగ్గించాలని పవన్ కుమార్ గుప్తా ఢిల్లీ హైకోర్టులో పెట్టుకున్న పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.

6 జనవరి 2020 – పవన్ కుమార్ గుప్తా తండ్రి ఢిల్లీ కోర్టులో వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది

జనవరి 7 – ఢిల్లీలోని పటియాలా కోర్టు నలుగురు దోషులను జనవరి 22న ఉదయం 7 గంటలకు తీహార్ జైలులో ఉరి తీయాలని డెత్ వారెంట్ జారీ చేసింది.

జనవరి 14 – సుప్రీంకోర్టు వినయ్, ముఖేష్‌ల క్యూరేటీవ్ పిటిషన్‌ను తిరస్కరించింది.

ముఖేష్ రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేశాడు

జనవరి 17 – ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింగ్ తిరస్కరించారు.

తీహార్ జైలు అధికారులు తాజాగా మరో తేదీని ఉరి శిక్ష కోసం కోరగా.. ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 1న ఉదయం గంటలకు సమయం ఇచ్చింది.

జనవరి 25 – తన క్షమాభిక్ష తిరస్కరణపై ముఖేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

జనవరి 29 – అక్షయ్ సుప్రీంకోర్టులో క్యూరేటీవ్ పిటిషన్ దాఖలు చేశాడు.

క్షమాభిక్ష తిరస్కరణపై ముఖేష్ వేసిన సవాలును సుప్రీంకోర్టు కొట్టేసింది.

జనవరి 30 – అక్షయ్ క్యూరేటీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

జనవరి 31 – తాను మైనర్‌ని అని పవన్ వేసిన పిటిషన్ తిరస్కరణ సమీక్షించమని సుప్రీంని ఆశ్రయించగా.. కోర్టు పిటిషన్ కొట్టేసింది.

ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్లను మళ్లీ వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాత వారెంట్లను రద్దు చేసింది.

ఫిబ్రవరి 5 – నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తిరస్కరించాలని.. విడివిడిగా ఉరికి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దోషులు తమ న్యాయపరమైన అన్ని హక్కులను ఒక వారంలోపు వినియోగించుకోవాలని ఆదేశించింది.

హైకోర్టు తీర్పుపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

ఫిబ్రవరి 6 – తీహార్ జైలు అధికారులు కొత్త డెత్ వారెంట్లు జారీ చేయాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.

ఫిబ్రవరి 7 – తీహార్ జైలు అధికారుల విన్నపాన్ని ట్రయల్ కోర్టు తిరస్కరించింది.

ఫిబ్రవరి 11 – తన క్షమాభిక్ష తిరస్కరణను సవాలు చేస్తూ వినయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు.

కొత్త డెత్ వారెంట్లు జారీ చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.

ఫిబ్రవరి 13 – పవన్ డీఎల్ఎస్ఏ నుంచి లాయర్ సహాయాన్ని తిరస్కరించాడు. దీంతో సుప్రీంకోర్టు అంజనా ప్రకాష్‌ను ఎమికస్‌గా నియమించింది.

తనకు మానసిక స్థితి సరిగా లేదని వినయ్ సుప్రీంలో పిటిషన్ వేయగా.. కేంద్రం అతడి ఆరోగ్యం బాగానే ఉందని వాదించింది.

ఫిబ్రవరి 14 – వినయ్ కుమార్ క్షమాభిక్ష తిరస్కరణ సవాలు పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది

ఫిబ్రవరి 17 – న్యాయవాది వృందా గ్రోవర్ తన తరపున ముఖేస్ తిరస్కరించాడు

ఢిల్లీ కోర్టు తాజాగా మార్చి 3న శిక్ష అమలు చేయాలని డెత్ వారెంట్లు జారీ చేసింది.

ఫిబ్రవరి 28 – పవన్ కుమార్ గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటీవ్ పిటిషన్ దాఖలు చేశాడు

మార్చి 2 – పవన్ క్యూరేటీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అతడు క్షమాభిక్షకు పిటిషన్ దాఖలు చేశాడు

తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నలుగురు దోషుల ఉరి శిక్షను అమలును ఢిల్లీ కోర్టు నిలిపేసింది.

మార్చి 4 – దోషుల ఉరి శిక్ష అమలుకు తాజాగా కొత్త తేదీని ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

మార్చి 5 – దోషులకు మార్చి 20న ఉరి శిక్ష అమలు చేయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది.

మార్చి 6 – తన న్యాయపరమైన హక్కులను తిరిగి ఉపయోగించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ముఖేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

మార్చి 11 – తనపై అనుచితంగా ప్రవర్తించినందుకు పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పవన్ కోర్టును ఆశ్రయించగా తిరస్కరణకు గురైంది.

మార్చి 12 – పవన్ పిటిషన్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ అతని తండ్రి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మార్చి 13 – తన క్షమాభిక్ష తిరస్కరణలో సరైన విధానాలు పాటించలేదని వినయ్ హైకోర్టును ఆశ్రయించాడు.

మార్చి 16 – తన న్యాయ హక్కుల పునరుద్దరణ కోసం ముఖేష్ వేసిన పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించింది.

ముగ్గురు దోషులు మరణ శిక్షపై స్టే విధించాలని అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించారు.

మార్చి 17 – నేరం జరిగిన సమయంలో తాను ఢిల్లీలో లేనని ముఖేష్ ఖ్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు కొట్టేసింది. పవన్ సుప్రీంకోర్టులో క్యూరేటీవ్ పిటిషన్ వేయగా.. అక్షయ్ రెండో సారి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు.

మార్చి 18 – ట్రయల్ కోర్టు ఆదేశాలపై ముఖేష్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు డిస్ మిస్ చేసింది. పవన్, వినయ్, అక్షయ్ మరణ శిక్షపై స్టే విధించాలని కోర్టును ఆశ్రయించారు.

మార్చి 19 – పవన్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. తను అప్పుడు ఢిల్లీలో లేనని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

ఢిల్లీ కోర్టు పవన్, వినయ్, అక్షయ్‌ల స్టే పిటిషన్ కొట్టేసింది.

రెండో క్షమాభిక్ష తిరస్కరణపై అక్షయ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది

మార్చి 20 (తెల్లవారుజామున) – దోషులు మరణశిక్షపై స్టే విధించమని పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దోషుల అన్ని రకాల పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో వారిని ఇవాళ ఉదయం 5.30 గంటలకు ఉరి తీశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news