‘వెంకీమామ ని’ వెంట్రుకలా తీసిపారేసిన ఆర్.ఎక్స్ 100 బ్యూటీ ..ఎందుకలా అనిందో తెలిస్తే షాకవుతారు ..?

-

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తారు. కాని కొంతమది వచ్చింది వ్బెళ్ళింది తెలీకుండా ఉంటుంది. అందుకు కారణం వాళ్ళు చేసిన సినిమాలే. అలా వచ్చి ఇలా కనుమరుగైపోయినా హీరోయిన్స్ లిస్ట్ చాలా పెద్దదే. కాని వాళ్ళందరికంటే చాలా స్పెషల్ .. ‘ఆర్ఎక్స్100’ సినిమా తో టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ‘ఆర్ఎక్స్100’ సినిమా ఒక్కటే పాయల్ కి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అంత క్రేజ్ ని తీసుకు వచ్చింది.

 

‘ఆర్ఎక్స్100’ సినిమా అంటే అందరికీ ముందు గుర్తొచ్చేసి పాయల్ రాజ్ పుత్. అంతగా క్రేజ్ వచ్చినప్పటికి స్టార్ హీరోయిన్ గా మాత్రం ఫేమస్ కాలేకపోయింది. ‘ఆర్ఎక్స్100’, ‘ఆర్డీఎక్స్100’ ఇలా రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో యూత్ కి అందాల విందు ఇచ్చినప్పటికి పాయల్ ని పట్టించుకున్న వాళ్ళు కరువయ్యారు. అయితే విక్టరీ వెంకటేష్ నటించిన ‘వెంకీమామ’ అలాగే మాస్ మహారాజా రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలలో ఛాన్స్ రావడం తో పాయల్ కి ఇక తిరుగు లేదు.. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది అని అందరు అనుకున్నారు.

అయితే రవితేజ డిస్కో రాజా డిజాస్టర్ అవగా వెంకీ మామ యావరేజ్ గా ఆడింది. దాంతో పాయల్ డిస్కో రాజా సినిమాని పక్కన పడేసి ‘వెంకీమామ’ సినిమా మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. డైరెక్టర్ బాబీ ‘వెంకీమామ’ సినిమాలో తన పాత్రను ముదర హీరోయిన్ లా డిజైన్ చేశాడని తెగ ఫీలవుతుందట. అనవసరంగా వెంకీమామా కమిటయ్యానని ఇప్పుడు ఫీలవుతుందట. మరి ఇప్పుడు పాయల్ ఫీలయ్యి లాభం లేదు కదా ..! సినిమా ఒప్పుకున్నప్పుడు ఆలోచించుకొని ఉండాల్సింది. ఒళ్ళు కాలిపోయాక ఇప్పుడు నీళ్ళు చల్లుకుంటే లాభమేముంది అంటున్నారు కొంతమంది. సినిమా ఫ్లాపయింది కాబట్టి ఇలా తీసి పారేస్తున్నావు అదే హిట్ అయితే ఇంకోలా మాట్లాడేవారు కదా అంటు పాయల్ మీద నెటిజెన్స్ సెటైర్స్ వేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news