కేంద్రంలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్టీ అధినాయకత్వం కసరత్తు ప్రారంభించింది. గురువారం ఉదయం ప్రధాని మోదీ సమక్షంలో కీలక సమావేశం నిర్వంచారు. ఇందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై కసరత్తు జరుగనుంది.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీఎల్ సంతోష్ పాల్గొన్నారు. ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.దీనికి తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికపై కూడా సమావేశంలో చర్చ జరగనుందని తెలుస్తోంది.ఇదిలాఉండగా, ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం ఇప్పటికే ముగియగా.. గత జనరల్ ఎలక్షన్స్ ముందు ఆయన పదవీకాలాన్ని మరోసారి పొడగించారు. ప్రస్తుతం ఆయన కేంద్రమంత్రిగానూ కొనసాగుతున్నారు. బీజేపీ రూల్ ప్రకారం.. ఒక్కరికి ఒకే పదవి ఉండాలి.ఈ మేరకు కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం కసరత్తు ప్రారంభించారు.