పటాన్ చెరు ఇక్రిశాట్ లో చిరుత కలకలం రేపింది. పటాన్ చెరు ఇక్రిశాట్ లో ఫారెస్ట్ అధికారులకు చిక్కింది చిరుత. గత కొన్ని రోజులుగా ఇక్రిశాట్ లో తిరుగున్నారు రెండు చిరుతలు. ఉదయం బోనులో ఓ చిరుత దొరికింది. చిరుతని నెహ్రు జూ పార్క్ కి తరలిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఇక పటాన్ చెరు ఇక్రిశాట్ లో చిక్కిన చిరుత దృశ్యాలు వైరల్ గా మారాయి.

చిరుత సంచారంతో రెండు రోజులుగా భయాందోళనలో ఇక్రిశాట్ కార్మికులు ఉన్నారు. బోన్ లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. బోనులో ఉన్న రెండు మేకలను తినేందుకు వచ్చి చిక్కింది చిరుత.