బ్రేకింగ్: అంతర్జాతీయ విమానాలకు మరో షాక్

-

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి దేశంలో మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాలపై మరోసారి నిషేధం పొడిగించింది. అంతర్జాతీయ విమానాలపై నిషేధం సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తూ… కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కార్గో విమాన సర్వీసులకు నిబంధనలు వర్తించబోవని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. దేశం లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 45 083 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌ లో పేర్కొంది. దీంతో దేశం లో ఇప్పటి వరకు 3,26, 95, 903 కేసులు నమోదు కాగా.. ఇందులో 3,18,88,642 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశం లో 3,68,558 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక అటు 24 గంటల్లో ఇండియా లో కరోనా తో 460 మంది మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version