ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ కోస్తా-దక్షిణ ఒడిస్సా తీరాలకు దగ్గరగా వాయువ్య బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం లలో నిన్న ఏర్పడిన “అల్పపీడనం” స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 km ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది.
“రుతుపవన ద్రోణి” పైన తెలిపిన అల్పపీడనం గుండా మరియు ఆగ్నేయ దిశగా తూర్పుమధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది. ఈరోజు తూర్పు-పడమర ‘షీర్ జోన్'(ద్రోణి) 15°N అక్షాంశము వెంబడి సగటు సముద్ర మట్టానికి 5.8 km నుండి 7.6 km ఎత్తుల మధ్య కొనసాగుతున్నది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వర్షాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములతో కూడి న వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లండించింది.