ఈనెల 18 వరకు నుమాయిష్ పొడిగింపు

-

హైద‌రాబాదీల‌కు నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ సొసైటీ గుడ్‌న్యూస్ చెప్పింది.హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన నుమాయిష్ను ఈ నెల 18 వరకు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న నుమాయిష్ ముగియాల్సి ఉంది.

 

కానీ మరో మూడు రోజులు పొడిగించినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. నుమాయిష్ గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో జనాలు భారీ సంఖ్యలో రావడం వల్ల రద్దీ పెరిగింది. ఈ నుమాయిష్ ప్రతి ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version