Telangana : వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్కార్ బడుల్లో ఫేస్‌ రికగ్నైజేషన్‌ ..!

-

పాఠశాలల్లో ప్రమాణాలను పెంచేందుకు తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణతో రెడీ అవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై ముందస్తుగానే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. సర్కారు బడుల్లో విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం (2023-24) ముఖ గుర్తింపు హాజరు (ఫేస్‌ రికగ్నైజేషన్‌) అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో ఈ విధానంలో పిల్లల హాజరును చేపడతామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 18 జిల్లాల్లో ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ హాజరును అమలుచేస్తున్న విషయం తెలిసిందే.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో సాంకేతికత వినియోగాన్ని పెంచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా.. పాఠశాలల్లో అగ్మెంటెడ్‌ / వర్చువల్‌ రియాలిటీ ల్యాబ్‌ల ఏర్పాటుకు విద్యాశాఖ ప్రతిపాదించింది. హైస్కూళ్లలో కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది.

8, 9, 10 తరగతులకు డిజిటల్‌ తరగతులను అందుబాటులోకి తెస్తారు. విద్యార్థుల హాజరుతో పాటు విద్యా సామర్ధ్యాలను నమోదు చేయడానికి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను ఇస్తారు. పాఠశాల విద్యాశాఖలో నిర్వహించే అన్ని కార్యక్రమాల కోసం డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తీసుకొస్తారు. ఆయా కార్యక్రమాల పర్యవేక్షణకు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version