ఫ్యాక్ట్ చెక్: పీఎం శ్రమయోగి మాన్‌ధన్‌ యోజన కింద డబ్బులొస్తున్నాయా..? నిజం ఎంత..?

-

మనకి తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక ఫేక్ వార్త వస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎక్కువైపోయాయి. నిజానికి ఈ సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తని కూడా అందరు నమ్మేస్తున్నారు. పైగా ఫేక్ వార్తల్ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్టు వచ్చింది.

మరి ఇక దాని గురించి చూస్తే… ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం 18 వేల రూపాయలు ఇస్తోంది అని ఆ పోస్ట్ లో ఉంది. పైగా 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్కీం కి అర్హులు అని మెసేజ్ లో ఉంది.

ఈ మెసేజ్ లోనే ఒక లింక్ కూడా షేర్ చేశారు. ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఆ లింక్ పైన క్లిక్ చేసి వివరాలను ఎంటర్ చేసుకోవాలని అందులో ఉంది. పైగా మోడీ ఫోటో కూడా అందులో ఉంది. కానీ నిజానికి ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి డబ్బులు రావడం లేదు.

అనవసరంగా ఈ ఫేక్ వార్తను స్ప్రెడ్ చెయ్యద్దు. నకిలీ వార్తలకు దూరంగా ఉండండి లేదంటే అనవసరంగా చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చిన ఈ వార్తలో కూడా ఎలాంటి నిజం లేదు కాబట్టి దీనిని కూడా మీరు నమ్మొద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version