ఫ్యాక్ట్ చెక్: ఐస్‌క్రీములు తింటే కరోనా వైరస్ వ్యాపిస్తుందా..?

-

ఎప్ప‌టిలాగే ఈ సారి కూడా ఎండాకాలం వ‌చ్చేసింది. ఎండ‌లు దంచి కొడుతున్నాయి. ఇక ప్ర‌తి వేస‌విలో మ‌న‌కు నోరూరించిన‌ట్లుగానే ఈ సారి కూడా క‌మ్మ‌ని ఐస్‌క్రీములు భిన్న ర‌కాల రుచుల‌ను పంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే క‌రోనా నేప‌థ్యంలో చాలా మంది ఐస్‌క్రీములు, ఇత‌ర చ‌ల్ల‌ని ప‌దార్థాలు తినేందుకు భ‌య‌ప‌డుతున్నారు. వాటి వ‌ల్ల కరోనా వ‌స్తుందేమోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇలాంటి వారిని భ‌యపెడుతూ సోష‌ల్ మీడియాలో పుకార్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

fact check does eating ice cream spreads corona virus

క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో.. ఐస్‌క్రీములు, చ‌ల్ల‌ని ప‌దార్థాలు తిన‌కూడ‌ద‌ని, తింటే ఆ వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌ని.. సోష‌ల్ మీడియాలో కొంద‌రు ఫేక్ వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అయితే దీనిపై ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్ పేరిట ట్విట్ట‌ర్‌లో వివ‌ర‌ణ ఇచ్చింది. ఐస్‌క్రీములు, ఇత‌ర చ‌ల్ల‌ని ప‌దార్థాలు తిన‌డం వ‌ల్ల క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని, అయితే అది ఇంకా శాస్త్రీయంగా రుజువు కాలేద‌ని.. పీఐబీ తెలియజేసింది.

పూర్తిగా హైజీనిక్ అయిన వాతావ‌ర‌ణంలో త‌యారు చేయ‌బ‌డిన ఐస్‌క్రీములు, ఇత‌ర ఫ్రాజెన్ ఫుడ్స్‌ను తింటే క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌న్న వ్యాఖ్య‌ల్లో ఎంత మాత్రం నిజం లేద‌ని, అందుకు త‌గిన సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా లేద‌ని పీఐబీ తెలిపింది. ఈ మేర‌కు పీఐబీ, పీఐబీ మ‌హారాష్ట్ర‌లు ట్విట్ట‌ర్‌లో వివ‌ర‌ణ ఇచ్చాయి. ఇలాంటి న‌కిలీ వార్త‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌కూడ‌ద‌ని ఆ సంస్థ హెచ్చ‌రిస్తోంది..!

Read more RELATED
Recommended to you

Latest news