40 మంది పోలీసులకు కరోనా…!

-

దేశంలో కరోనా మహమ్మారి మానవత్వం చూపించడం లేదు. తగ్గింది లేదు అనుకున్న కరోనా క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ వైరస్ ని కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కరోనా వైరస్ సోకడం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా దాదాపు 200 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. వీరిలో 5 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

దీనితో మహారాష్ట్ర ప్రభుత్వం 55 ఏళ్ళు దాటిన పోలీసులు విధులకు రావొద్దని చెప్పింది. ఇక తాజాగా అదే రాష్ట్రంలోని మాలెగావ్ కంటైన్మేంట్ జోన్లలో పని చేస్తున్న విధుల్లో ఉన్న 40 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ రావడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. వీరిలో పలువురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరికి ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

వారిలో ఇద్దరు ఆరోగ్యం విషమంగా ఉందని అధికారులు చెప్తున్నారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. రాజధాని ముంబైలోనే ముంబయిలోనే 7061 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు క్రమంగా పెరగడంతో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. ఆ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కరోనా ప్రభావం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news