ఫ్యాక్ట్ చెక్: ఈ లింక్ మీద క్లిక్ చేస్తే.. ఉచితంగా ల్యాప్టాప్స్..?

-

ఈ మధ్య కాలంలో నకిలీ వార్తలు ఎక్కువ అయిపోయాయి. ప్రభుత్వ స్కీములకి సంబంధించి నకిలీ వార్తలు వినపడుతున్నాయి. అలానే సోషల్ మీడియాలో తరచు ఏదో ఒక నకిలీ వార్త మనకి కనబడుతూనే ఉంటుంది. ఇటువంటి నకిలీ వార్తలకి దూరంగా ఉండాలి లేకపోతే లేని పోని ఇబ్బందులు వస్తాయి. అనవసరంగా మీరే మోస పోవాల్సి వస్తుంది.

తాజాగా ఒక మెసేజ్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. ఇక సోషల్ మీడియాలో వచ్చిన మెసేజ్ ని చూస్తే… ఒక లింక్ ఇచ్చి ఆ లింక్ ని క్లిక్ చేస్తే ఫ్రీగా లాప్టాప్స్ ని పొందచ్చని… యువత కోసం ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పిస్తోందని అందులో ఉంది. లింక్ మీద క్లిక్ చేసాక పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఆ తర్వాత ఫ్రీగా లాప్టాప్స్ ని పొందొచ్చు. మరి నిజంగా ప్రభుత్వం ఇలాంటి అవకాశాన్ని ఇస్తోందా..? ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా విద్యార్థులకు లాప్టాప్ ఇవ్వడం లేదు. ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే అనవసరంగా ఇటువంటి మెసేజ్లను చూసి మోసపోకండి.

దీని వలన మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్రీగా కేంద్ర ప్రభుత్వం లాప్టాప్స్ ఇస్తున్న వార్త నకిలీ వార్త మాత్రమే కనుక అనవసరంగా ఇతరులకి ఎటువంటి వార్తలను షేర్ చేయకండి. అలానే నమ్మి పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మోసపోకండి. పీఐబి ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. ఇది నకిలీ వార్త అని చెప్పేసింది. కాబట్టి ఇటువంటి వార్తలతో జాగ్రత్తగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version