ఈ ఏడాది రాజ్ భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలు

-

ఈ ఏడాది గణతంత్ర వేడుకలు రాజ్ భవన్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. పబ్లిక్ గార్డెన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు జరగలేదు. ఈ వేడుకలకు సంబంధించి రాజ్ భవన్‌లోనే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీన రాజ్ భవన్లో ఉదయం జాతీయ పతాకాన్ని గవర్నర్ ఆవిష్కరిస్తారు. సాయంత్రం ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే.. గణతంత్ర వేడుకలపై ఇప్పటివరకు రాజభవన్కు ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. రాజభవన్లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఉదయం జెండా ఆవిష్కరణ, సాయంత్రం ఎట్ హోమ్ నిర్వహిస్తారు.

గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు ముదురుతున్నట్లే కనిపిస్తోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గతేడాది రాజభవన్లో జరిగిన 73వ గణతంత్ర వేడుకలకు కేసీఆర్ హాజరుకాలేదు. ప్రగతి భవన్ లోనే ఉన్నప్పటికీ కూతవేటు దూరంలోని రాజ్‌భవన్‌కు రాకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లోని అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, నివాళులర్పించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version