ఫ్యాక్ట్ చెక్: ”రైట్ టు ఎడ్యుకేషన్” పరీక్ష ఉందా..? కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందా..?

-

సోషల్ మీడియాలో కనపడే నకిలీ వార్తల గురించి మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. రోజు రోజుకీ నకిలీ వార్తలు సోషల్ మీడియా లో ఎక్కువగా కనబడుతున్నాయి. నిజానికి నకిలీ వార్తలకి దూరంగా ఉండాలి. చాలామంది నకిలీ వార్తలని నిజం అనుకుని మోసపోతున్నారు.

exam

మోసగాళ్లు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసి డబ్బుని కాజేయాలని చూస్తున్నారు తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది మరి అది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడే తెలుసుకుందాం… ఈమధ్య కాలంలో చాలా వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ లో ప్రభుత్వ స్కీమ్స్ అని.. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రూల్స్ అని ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నాయి.

చాలామంది ఈ ఫేక్ వార్తలు నిజం అని భావించి మోసపోతున్నారు. కాబట్టి అటువంటి ఫేక్ వెబ్సైట్లకు ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ కి దూరంగా ఉండటం మంచిది ఇక తాజాగా వచ్చిన వార్తను చూస్తే… కేంద్ర ప్రభుత్వం 550 రూపాయలు 350 రూపాయలని రైట్ టు ఎడ్యుకేషన్ ఎగ్జాం కింద రిజిస్ట్రేషన్ ఫీజు గా తీసుకుంటోంది అని ఇందులో ఉంది.

మరి నిజంగా ఈ డబ్బులు తీసుకుంటుందా లేదంటే కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి మోసం చేస్తున్నారా అనేది చూస్తే… ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది ఈ వెబ్సైట్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి సంబంధం లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇటువంటి పరీక్ష ని నిర్వహించడం లేదు. ఇది పట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది.

పైగా (http://rtegov.org.in) ఈ వెబ్సైట్ కూడా వట్టి నకిలీదే అని తెలుస్తోంది. కాబట్టి ఇటువంటి వార్తలని నమ్మి అనవసరంగా మోసపోకండి ఎటువంటి ఫీజు చెల్లించకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందించి ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది. సో ఏ డబ్బులు కట్టద్దు. ఇతరులకి కూడా నకిలీ వార్తలని షేర్ చెయ్యద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version