ఫ్యాక్ట్ చెక్: అది నకిలీ వెబ్ సైట్ ఏ… జాగ్రత్తగా వుండండి..!

-

నకిలీ వార్తలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో తరచు మనకి ఫేక్ వార్తలు కనబడుతూనే ఉంటాయి. అయితే నిజానికి ఇలాంటి ఫేక్ వార్తలుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చాలా మంది సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి వార్త నిజం అని నమ్ముతారు. కానీ సోషల్ మీడియాలో కనబడే ప్రతి వార్తా నిజం కాదు.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ మరి అదేంటి..?, దానిలో నిజం ఎంత అనే విషయాన్ని చూద్దాం. రాష్ట్రీయ స్వస్త్య బీమా యోజన పలు ఉద్యోగాలని భర్తీ చేస్తోందని.. ఈ మేరకు దరఖాస్తులని స్వీకరిస్తుందని ఫీజు కింద అభ్యర్థులు 600 రూపాయలు చెల్లించాలని ఆ వార్త లో ఉంది.

మరి నిజంగా రాష్ట్రీయ స్వస్త్య బీమా యోజన ద్వారా అభ్యర్థుల్ని భర్తీ చేస్తున్నారా లేదా..? 600 రూపాయలు చెల్లించ వచ్చా..? రాష్ట్రీయ స్వస్త్య బీమా యోజన https://rsby.ind.in/vacancies ద్వారా ఉద్యోగాలని భర్తీ చేయడం అనేది నిజం కాదు. ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే. రాష్ట్రీయ స్వస్త్య బీమా యోజన అని అభ్యర్ధులని మోసం చేస్తున్నారు తప్ప ఇది నిజం కాదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని పై స్పందించింది. ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది. కనుక అనవసరంగా ఈ వార్త ని నమ్మి మోసపోవద్దు. అలానే ఇతరులకి షేర్ చెయ్యద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version