ఫ్యాక్ట్ చెక్: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా..? ఇలా చేస్తే కేంద్రం నుండి రూ.5,000..!

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.

కరోనా మహమ్మారి వల్ల మనం ఎంతగానో ఇబ్బంది పడ్డాము చాలా మంది కరోనా రావడంతో మృతి చెందారు కూడా. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రభుత్వం వ్యాక్సిన్ కూడా తీసుకొచ్చింది. అయితే తాజాగా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ల కోసం ఒక మెసేజ్ వచ్చింది.

కరోనా టీకా వేయించుకున్న వాళ్లు ఒక ఫారం నింపి పంపిస్తే ప్రధానమంత్రి జన్ కళ్యాణ్ విభాగ్ ద్వారా ఐదు వేల రూపాయలుని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు ఈ మెసేజ్ లో ఉంది. అయితే మరి వైరల్ అవుతున్న ఈ మెసేజ్ నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.

కరోనా టీకా వేయించుకున్న వాళ్లు ఫారం నింపితే ఐదు వేల రూపాయలు వస్తాయి అన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. ఇది కేవలం ఫేక్ వార్త మాత్రమే ఇటువంటి మెసేజ్లని అనవసరంగా నమ్మొద్దు. ఈ మెసేజ్ లో నిజం లేదు కాబట్టి అనవసరంగా ఇతరులకు షేర్ చేయొద్దు మీరు కూడా మోసపోవద్దు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version