ఈ మధ్య కాలం లో నకిలీ వార్తలు విపరీతంగా పెరిగిపోయాయి. పైగా ఎక్కువ మంది మోసాలకి పాల్పడుతున్నారు. దీనితో తీవ్ర నష్టం కలుగుతోంది. ఏది ఏమైనా ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి లేకపోతే లేనిపోని ఇబ్బందులు తప్పవు. ఈ మధ్య కాలం లో ఫేక్ వార్తలు సోషల్ మీడియా ద్వారా తెగ షికార్లు కొడుతున్నాయి. ఇటువంటి ఫేక్ వార్తలు పై జాగ్రత్తగా ఉండాలి. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియకుండా మీరు అనవసరంగా ఇతరులతో షేర్ చేసుకోకండి.
తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇంతకీ మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. మీడియా రిపోర్టుల బట్టీ నీతి ఆయోగ్ పలు బ్యాంకులు ప్రైవేటీకరణ అవుతున్నాయి అంటూ ఒక వార్తని స్ప్రెడ్ చేస్తున్నారు. మరి నిజంగా కొన్ని బ్యాంకులు ప్రైవేటీకరణ అవుతున్నాయా..? నీతి అయోగ్ లిస్టు నిజమేనా ఈ విషయానికి వస్తే..
Several media reports claim that a list has been shared by Niti Aayog on the privatization of Public Sector Banks#PIBFactCheck
▶️This claim is #Fake
▶️No such list has been shared by @NITIAayog in any form.
🔗https://t.co/HOQDDDoMS8 pic.twitter.com/ZDETUQjAJ5
— PIB Fact Check (@PIBFactCheck) January 6, 2023
దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రైవేటీకరణ అని నీతి అయోగ్ చెప్పినది నిజం కాదు ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే. నీతి ఆయోగ్ ఈ విషయాన్ని చెప్పలేదు ఎటువంటి లిస్ట్ ని కూడా నీతి అయోగ ప్రవేశపెట్టలేదు ఇది వట్టి నకిలీ వారితో మాత్రమే కనుక అనవసరంగా ఇటువంటి ఫేక్ వార్తలని స్ప్రెడ్ చేయకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించి ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది.