ఫ్యాక్ట్ చెక్: అయ్యప్ప ప్రసాదం టెండర్ ని కేరళ ప్రభుత్వం అరబ్ కంపెనీకి ఇచ్చిందా..? నిజమెంత..?

-

ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ ఫేక్ వార్తలు వింటున్నాము. టెక్నాలజీ బాగా పెరగడం.. ఎక్కువ మంది సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు షేర్ చేయడం జరుగుతోంది. అయితే వీటిలో చాలా నకిలీ వార్తలు ఉంటున్నాయి.

తాజాగా ఇదే రీతిలో ఒక వార్త వచ్చింది. ఇక దానికోసం పూర్తి వివరాల్లోకి వెళితే… శబరిమల ప్రసాదం తయారీ టెండర్ ఆల్ జహా స్వీట్స్ అనే ఒక యుఏఈ కంపెనీకి ఇచ్చారని వార్త వచ్చింది. అయితే నిజంగా కేరళ ప్రభుత్వం అరబ్ దేశానికి ఈ టెండర్ ని ఇచ్చిందా..? నిజం ఎంత అనేది చూస్తే…

ప్రస్తుతం ఉన్న అరవన ప్రసాదం కంటైనర్ కు కంపెనీ ప్యాకేజింగ్ కి చాలా తేడా ఉంది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని దేవస్థానం బోర్డు కూడా చెప్పింది. అయితే కొన్ని చోట్ల అరవన పాయసం అనే పేరుతో కంపెనీలు స్వీట్లు తయారు చేసి అమ్ముతున్నారు. దుబాయ్ లోని ఆన్ లైన్ లో కూడా దీన్ని విక్రయిస్తున్నారు.

మనం ఫోటోలు జాగ్రత్తగా చూస్తే దాని పై అరవన పాయసం అని ఉంది. కానీ అది అరవన ప్రసాదం కాదు. అసలైన అరవన ప్రసాదం తో కనుక ఈ ఫోటోని పోల్చిచూస్తే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అని కానీ శరణం అయ్యప్ప అని కానీ లేదు. దీనితో ఇది కచ్చితంగా ఫేక్ అని తెలుస్తోంది. అరవన ప్రసాదంని కేరళ ప్రభుత్వం అరబ్ కంపెనీకి టెండర్ ఇవ్వలేదు అని స్పష్టంగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version