ప్రసిద్ధి గాంచిన హిందూ దేవాలయాలు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా చాలా ఉన్నాయి. అయితే భారతీయ సంస్కృతికి చిహ్నంగా ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా వెలుగొందుతోంది కాంబోడియాలోని `అంగ్‌కోర్ వాట్ దేవాలయం`. కంబోడియాలోని సీమ్ రీప్ అనే పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో అంగ్‌కోర్ వాట్ దేవాలయం కంబోడియాలోని సీమ్ రీప్ అనే పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అంగ్‌కోర్ వాట్ దేవాలయం. ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుదేవాలయం.
ఖెమర్ రాజులచే కట్టబడిన ఈ దేవాలయం మన హిందూ నాగరికతకు ఆనవాళ్ళు. మూడవ శతాబ్దం నుండి దాదాపు వేయి సంవత్సరాలకు పైగా హైందవ నాగరికత కంబోడియలో ఉచ్ఛస్థితిలో ఉంది. భారతీయ పురాణేతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ దేవాలయ గోడలపై విష్ణుమూర్తి మొదలగు హిందూ దేవుళ్లతోపాటు, రామాయణ, మహాభారత కాలంనాటి అద్భుతమైన ఘట్టాలు శిలా రూపాల్లో అత్యద్భుతంగా చెక్కబడి మనకు దర్శనమిస్తాయి.ఇక్కడ బౌద్ధమత సంస్కృతి ఎక్కువగా ఉంది. ఏనుగుల మిద్దెలు, లెపర్ రాజు ప్రతిమలు, బెయాన్, బఫూన్ లాంటి అనేక నిర్మాణాలు ఇక్కడి ప్రత్యేకత. ఆంగ్‌కోర్ థోమ్ మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోర్డెన్ టవర్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 54 అంతస్తులతో నిర్మించిన బెయాన్ (బుద్ధుని) దేవాలయం ఆంగ్‌కోర్ థోమ్‌కి ఆకర్షణీయంగా నిలుస్తుంది. అడుగు నుంచి నాలుగడుగుల మేర ఉన్న ఇసుకరాతి ఇటుకలను పేర్చి దీనిని నిర్మించారు. తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది.ఈ మందిరం ఎత్తు 24 అడుగులు ఉంది. దాని పైన శిఖరం కూడా గతంలో ఉండేదనేందుకు నిదర్శనంగా ఉన్నాయి. పునాదులు లేకుండా తొమ్మిడి అడుగుల మందంతో రాతి ఇటుకలతో నిర్మించారు. ఎన్నో అద్భుత కట్టడాలను ఈ ఆలయంలో నిర్మించారు. జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం ఒకటి.