రాహుల్ సిప్లిగంజ్ మీద దాడి వెనక ఒళ్ళు గగ్గుర్పొడిచే నిజం ఇదిగో ??

-

ప్రముఖ తెలుగు పాప్ సింగర్ బిగ్ బాస్ టైటిల్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కి ప్రస్తుతం బయట మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 3 కి విన్నర్ కావడంతో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు రాహుల్. అంతేకాకుండా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఛాన్స్ కూడా దక్కించుకున్నాడు. బిగ్ బాస్ షో తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ సింగర్ కి పబ్ కల్చర్ ఉండటం వల్ల అనవసర గొడవలు తన మీదికి తెచ్చుకున్నాడు. ఇటీవల హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలి ప్రాంతంలో ఓ పబ్ కి రాహుల్ సిప్లిగంజ్ మరియు ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి వెళ్ళారు.  అయితే ఈ గ్యాంగ్ లో అమ్మాయి కూడా ఉంది. దీంతో ఆ అమ్మాయి ని పబ్ లో కొందరు కామెంట్ చేయడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించడంతో పబ్ లో గొడవ స్టార్ట్ అయింది. గొడవ ముదిరి ముదిరి కొట్టుకునే దాకా వెళ్ళింది. కాగా అవతలి వ్యక్తి అలియాస్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఎంఎల్ఏ తమ్ముడు మరియు అతని ఫ్రెండ్స్. దీంతో గొడవ బాగా సీరియస్ కావడంతో అంతా కలిసి బీర్ బాటిల్స్ తో రాహుల్ సిప్లిగంజ్ పై అటాక్ చేశారు. దాంతో రాహుల్ కి తీవ్రమైన గాయాలయ్యి చాలా రక్తం పోయింది.

 

వెంటనే అక్కడ సిబ్బంది రాహుల్ ని దగ్గర ఉన్న హాస్పిటల్ లోకి వెళ్లి జాయిన్ చేశారు. బీరు బాటిల్ తో గట్టిగా కొట్టడం వల్ల రాహుల్ కి గట్టిగానే తలపై గాయం అయింది. దీంతో పోలీసులు విచారణలో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు ఈ గొడవ గురించి బయట పడుతున్నాయి. అదేమిటంటే గొడవ జరుగుతున్న సందర్భంలో ముందే రాహుల్ ఎమ్మెల్యే తమ్ముడు అతని సోదరులపై చాలా కోపంగా బూతులు తిట్టి రెచ్చగొట్టడం తో వాళ్ళు ఎటాక్ చేయడం జరిగిందని కొంతమంది గొడవ చూసినవాళ్లు కామెంట్ చేసినట్లు విచారణలో తేలినట్లు వార్తలు వస్తున్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version