జగన్ ని ఇరికిద్దాం అనుకుని అడ్డంగా ఇరుక్కున్న మోడి – అమిత్ షా .. ??

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల కాన్సెప్ట్ ని తెరపైకి తీసుకు రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు అదేవిధంగా తెలుగుదేశం మరియు జనసేన పార్టీ బిజెపి పార్టీ నాయకులు జగన్ నిర్ణయం పట్ల ఫుల్ సీరియస్ అయ్యారు. ఇదే సమయంలో జగన్ పార్టీ నాయకులు ఒక చోట మాత్రమే అభివృద్ధి చేయడం వల్ల హైదరాబాద్ విషయంలో జరిగింది మళ్లీ రిపీట్ అవుతుందని వ్యాఖ్యానించడం జరిగింది. అభివృద్ధి కూడా అంతటా జరగాలని పేర్కొన్నారు. ఇలా చేయటం వల్ల రాష్ట్రంలో ప్రజల మధ్య గొడవలు రావు అని చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో బీజేపీ పార్టీ పెద్దలు కూడా జగన్ తీసుకొన్ననిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది. వెంకయ్యనాయుడు లాంటివాళ్ళు అమరావతి రైతులకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో మోడీ మరియు అమిత్ షా తీసుకున్న నిర్ణయం జగన్ ని ఇరికిద్దాం అనుకున్న వాళ్ళని అడ్డంగా ఇరుక్కున్నటు చేసినట్లు అయ్యింది. మేటర్ లోకి వెళితే బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రం ఉత్తరాఖండ్ లో ఇప్పుడు మూడు రాజధానులు ఏర్పాటు చేశారు.

 

ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయిన తరువాత డెహ్రాడూన్ రాజధానిగా పరిపాలన సాగుతుండేది. అయితే, హైకోర్టును నైనిటాల్ లో ఏర్పాటు చేశారు. 2014లో సమ్మర్ రాజధానిగా గైర్సెన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత అక్కడ చిన్న టెంటు లాంటివి వేసి సమ్మర్ లో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే తాజాగా అధికారికంగా ఆ ప్రాంతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్ సమ్మర్ క్యాపిటల్ గా గైర్సెన్ ను ఏర్పాటు చేయడంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం మూడు రాజధానులు కలిగిన రాష్ట్రము అయ్యింది.  

Read more RELATED
Recommended to you

Exit mobile version