ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఓటమి రెండు ఉంటాయి. అయితే ప్రతిసారి గెలుపొందలేము. అలానే ప్రతిసారి ఓటమే ఉండదు. ఏది ఎప్పుడు వస్తుందనేది ఎవరు ఊహించలేము. ఒకరోజు గెలిస్తే ఒకరోజు ఓటమి తప్పదు. కానీ ఓడిపోయామని చాలా మంది అక్కడితో ఆగిపోతూ ఉంటారు అది అసలు మంచిది కాదు. ఓటమిని ఒకసారి ఎదుర్కొంటే గెలుపొందడానికి అవుతుంది.
నిజానికి అపజయం విజయానికి మొదటి మెట్టు. ఆచార్య చాణక్య మనకి జీవితంలో గెలుపొందడానికి ఎన్నో విషయాలని చెప్పారు నిజానికి గెలుపు గురించి కూడా చాణక్య కొన్ని విషయాలు చెప్పారు. మరి చాణక్య చెప్పిన రహస్య సూత్రం చూద్దాం. నిజానికి విజయం సాధించడానికి ఎటువంటి రహస్య సూత్రం లేదని చాణక్య అన్నారు. లక్ష్యానికి అనుగుణంగా నడుచుకోవడం… కష్టపడి ప్రతి ఒక్కరు పని చేయడం… ఓటమి నుండి నేర్చుకోవడం ఇవే లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమని అన్నారు. అయితే విజేతలు అవ్వాలన్నా.. అనుకున్నది సాధించాలన్నా ఈ రెండూ అస్సలు మర్చిపోకండి.
విమర్శలని వినద్దు
చాలా మంది మన ఓటమిని చూసి విమర్శిస్తూ ఉంటారు కానీ ఒక చెవితో విని మరొక చెవితో వాటిని వదిలి పెట్టాలి. అప్పుడే గెలుపొందడానికి అవుతుంది. లక్ష్యం పైన ఏకాగ్రత పెట్టడానికి అవుతుంది.
ప్రయత్నం హద్దు
ప్రయత్నాన్ని అస్సలు ఆపకండి. ప్రయత్నిస్తే ఖచ్చితంగా గెలుపొందొచ్చు ఒకసారి ఓటమి ఎదురైనా ప్రయత్నిస్తే ఖచ్చితంగా జీవితంలో అనుకున్నది సాధించడానికి అవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఈ రెండు విషయాలను గుర్తు పెట్టుకొని లక్ష్యం వైపు వెళ్తే కచ్చితంగా సాధించడానికి అవుతుంది.