ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

-

ఫెయిర్ అండ్ లవ్లీ అనగానే ముందుగా గుర్తొచ్చే ముద్దుగుమ్మ యామీ గౌతమ్.. ఇకపోతే నేటి యువత ఆలోచనలలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. వివాహం విషయంలో వారి ఆలోచన ధోరణి మారుతోంది. వివాహం కెరియర్ కు అడ్డుకట్ట అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. అందుకే కెరియర్ లో స్థిరపడిన తర్వాతనే వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కేవలం మిగతా రంగాలలో ఉన్న వారే కాదు సినీ రంగంలో ఉన్నవారు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. వివాహం సినీ కెరియర్ కు బ్రేక్ అనే అభిప్రాయంలో ఉంటున్నారు.

అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికితే ..పెళ్లి తర్వాత కూడా కెరియర్ లో దూసుకుపోవచ్చు అని చెబుతోంది అందాల తార యామి గౌతమ్. ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటనతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఈమె హిందీతో పాటు తెలుగు చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. ఇకపోతే పెళ్లి తర్వాత సెటిల్ అయిన ఈమె కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ విషయంపై యామీ గౌతమ్ మాట్లాడుతూ పెండ్లి తర్వాత హీరోయిన్ కెరియర్ ముగిసినట్టే అనుకుంటే పొరపాటు.. కెరియర్ కు పెళ్లి అడ్డు కాదని ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు నిరూపించారు.

ప్రతి మహిళ జీవితంలో ఎన్నో అనుకుంటుంది . అందుకు తగ్గట్టుగానే జీవిత భాగస్వామి ప్రోత్సాహం లభిస్తే మహిళకు రెండింతల ఉత్సాహం లభిస్తుంది అని చెప్పుకొచ్చింది. అలాగే తన భర్త ఆదిత్య ధర్ గురించి మాట్లాడిన ఈమె నా భర్త కూడా సినీ పరిశ్రమకు చెందిన వాడే కావడం నాకు కలిసొచ్చింది. వృత్తి జీవితంలో నా సవాళ్లు ఏమిటన్నది ఒక రచయిత, దర్శకుడిగా ఆయనకు తెలుసు. అందుకే నేను వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇప్పటికీ మంచి అవకాశం వస్తే తప్పకుండా తెలుగులో కూడా నటిస్తానని తన మనసులో మాట బయట పెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version