మంత్రాలతో మహిళలను లోబర్చుకుని, అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఫేక్ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఫేక్ బాబా బాపుస్వామిని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
వారి కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బాపుస్వామి పూజలు చేసి సమస్యలు తొలగిస్తానని.. మహిళతో పరిచయం పెంచుకొని మత్తు పదార్థం ఇచ్చి వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మహిళల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసేవాడని వెల్లడించారు. ఈ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టంచేశారు.