బ్రహ్మోస్ మిస్సైల్ ఫెయిల్ అంటూ డీఆర్‌డీవో పేరిట ఫేక్ ప్రచారం..

-

పహెల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న వేళ కొందరు కావాలని భారత ఆర్మీ, ఇక్కడ రక్షణ రంగాల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రారంభించారు. నిన్న రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ మీద సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు షురూ అయ్యాయి. DRDO ఒక లెటర్ విడుదల చేసిందని సోషల్ మీడియాలో ఒక లెటర్ వైరల్ అవుతోంది. నిన్న రాత్రి జరిగిన మిసైల్ అటాక్‌లో బ్రహ్మోస్ క్షిపణి భాగాలు విఫలమయ్యాయంటూ.. ఒక లేఖ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ లెటర్ ఫేక్ అని, అది వాస్తవం కాదని తేల్చిన PIB ఫ్యాక్ట్ చెక్ తేల్చిచెప్పింది.DRDO అలాంటి లేఖను విడుదల చేయలేదని ట్విట్టర్ వేదికగా స్పష్టంచేశారు. అసలు ARDEలో ఏఎస్ కుమార్ అనే శాస్త్రవేత్తనే లేడని క్లారిటీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news