పహల్గామ్ లో ఉగ్రవాదులు చేసిన దాష్టికానికి ప్రతీకారంగా.. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదులను చావుదెబ్బ కొట్టిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కుటుంబంతో కలిసి సరదాగా గడుపుదామని వెళ్లిన వారిని హిందువులో కాదో నిర్థారించుకొని మరీ చంపినందుకు ఉగ్రవాదులకు దక్కిన ప్రతిఫలమిది అన్నారు. పహల్గామ్ దాడి జరిగిన రోజే.. భారతీయులను చంపిన టెర్రరిస్టులను వదలబోనని మోడీ సంకల్పం చేశారని.. ఇవాళ దానిని నెరవేర్చారని తెలిపారు.

దాడి సమయంలో ఒక మహిళ తన భర్తను చంపవద్దని ఉగ్రవాదిని ప్రాధేయపడగా.. వెళ్లీ మీ మోడీకి చెప్పుకో.. అని అన్న విషయాన్ని గుర్తు చేశారు. మోడీకి చెబితే వచ్చే రిజల్ట్స్ అని ఇప్పుడు చూపించారన్నారు. హిందూ మహిళల బొట్టు తీసేస్తే.. రియాక్షన్ ఎలా ఉంటుందో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమేనని.. భారత సైన్యం చేసిన మెరుపు దాడులపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేవలం దాడులు మాత్రమే చేస్తే.. సరిపోదని.. పాకిస్తాన్ ఒక టెర్రరిజం ఫ్యాక్టరీ అని.. పాక్ పై యుద్ధం చేసి మొత్తాన్నీ ఖతం చేయాలనీ మోడీకి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.