జమ్ముకాశ్మీర్‌లోని పహెల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయ్యింది. నిన్న రాత్రి 12 గంటల తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. అంతకుముందు బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన మోడీ.. ప్రెసిడెంట్‌తో భేటీ అయ్యి ఆర్మీ ఆపరేషన్ గురించి వివరాలను వెల్లడించినట్లు సమాచారం. ఆపరేషన్ చేపట్టిన తీరు, మన సైన్యం ధైర్య సాహసాలను వివరించి చెప్పినట్లు తెలిసింది. మరోవైపు ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ సిందూర్ తర్వాతి పరిణామాలను వివరించనున్నట్లు సమాచారం.