ఫేక్ కరెన్సీ కలకలం.. రూ.317 కోట్లు సీజ్

-

గుజరాత్లోని సూరత్లో ఫేక్ కరెన్సీ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి రూ.317 కోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ.67 కోట్లు రద్దైన రూ.500, రూ.1000 నోట్ల రూపంలో ఉన్నాయని తెలిపారు. బ్లాక్ కరెన్సీని వైట్గా మారుస్తామంటూ పలువురిని ఈ ముఠా మోసం చేసి డబ్బులు వసూలు చేసిందన్నారు. ఈ నోట్లు ముద్రిస్తున్న వారి కోసం సిబ్బంది గాలిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. రంగారెడ్డి జిల్లాలో ఫేక్ కరెన్సీ కల్లోలం రేపింది.పక్కా సమాచారంతో చాకచాక్యంగా వ్యవహరించిన పోలీసులు మైలార్ దేవ్ పల్లిలో భారీగా నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి భారీగా ఫేక్ కరెన్సీ తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.మరికాసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version