Breaking : త్వరలో ఉద్యోగులకు కేంద్రం తీపికబురు

-

ఉద్యోగులకు మరో కానుక ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. డీఏ పెంపు తర్వాత ఇంటి అద్దె అలవెన్స్ను కూడా పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్న నగరాన్ని బట్టి వారికి ఇంటి అద్దె భత్యం ఇవ్వనుంది. HRAను ప్రస్తుత స్థాయి నుంచి 3 నుంచి 4శాతం పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. సెప్టెంబర్ 28న మోదీ ప్రభుత్వం డీఏను 34శాతం నుంచి 38శాతానికి పెంచింది. దీంతో పాటు.. మన జీవన శైలి విధానాల వల్ల, అనేక అనారోగ్య కారణాలతో చాలా మంది ఇబ్బంది పడుతున్న క్రమంలో ఇప్పుడు ప్రతీ ఇంట్లో మందుల వినియోగం అనివార్యంగా మారింది. అయితే మనం వాడుతున్న మందులు మంచివా కాదా? అవి నాణ్యమైనవేనా? నకిలీవా? వంటి అనేక అంశాలు వినియోగదారులకు తెలియవు. వైద్యులు మందులు రాయటం, మనం గుడ్డిగా తెచ్చుకుని వాడటం అలవాటైపోయింది. ఈ క్రమంలోనే కేంద్రం సంచలన నిర్ణయం తీసుకొని వినియోగదారులు సైతం అసలు మందులు ఏవి? నకిలీ మందులు ఏవి అనేది గుర్తించేలా ఓ నిర్ణయం తీసుకుంది.

అనారోగ్య కారణాలతో మందులు వాడే వారికి నకిలీ మరియు నాసిరకం మందులను గుర్తించేలా కేంద్ర ఒక సంచలన విధానాన్ని తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంది. నకిలీ మరియు నాసిరకం మందుల వాడకాన్ని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ట్రాక్ అండ్ ట్రేస్ యంత్రాంగాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. మెడికల్ షాప్ లోకి వెళ్లి మందులు కొనుగోలు చేసే వినియోగదారులు తాము కొనుగోలు చేస్తున్న మందులు ప్రామాణికమైన లేదా అనేది తెలుసుకోవడానికి మెడిసిన్స్ పై క్యూఆర్ కోడ్ ముద్రించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version