కమలం సింగిల్..బీఆర్ఎస్‌తో జనసేన.!

-

ఏపీలో బీజేపీ-జనసేన పార్టీలు పొత్తుతో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల తర్వాత నుంచి రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. పేరుకు పొత్తు పెట్టుకున్నాయి గాని..ఏనాడూ కలిసి పనిచేసినట్లు కనిపించలేదు. ఎవరి దారి వారిదే అన్నట్లు ముందుకెళుతున్నారు. కేంద్రం సపోర్ట్ ఉంటుందని పవన్..బీజేపీతో కలిశారని అర్ధమవుతుంది. అలాగే జనసేనతో పొత్తు ఉంటే ఏపీలో నాలుగు ఓట్లు పడతాయని బీజేపీ కలిసినట్లు ఉంది. అంతే తప్ప..వీరికి పెద్దగా కలిసి పనిచేసే ఆలోచన కూడా ఉన్నట్లు లేదు.

సరే ఏదొకటి ఏపీలో పొత్తులో ఉన్నాయి..అలాగే వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి..టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదని ప్రచారం జరుగుతుంది. అటు చంద్రబాబు కూడా బీజేపీతో కలిస్తే కేంద్రం అండ దొరుకుతుందని చూస్తున్నారు. అయితే ఏపీలో ఈ మూడు పార్టీల పొత్తు సెట్ అవ్వొచ్చు..లేదా టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయొచ్చు. అలా కాదు అంటే బీజేపీ-జనసేన కలిసి..టీడీపీ సెపరేట్ గా పోటీ చేయొచ్చు. అంటే ఏపీలో ఏదైనా జరగొచ్చు.

అయితే ఏపీ విషయం పక్కన పెడితే..తెలంగాణలో మాత్రం బీజేపీ…జనసేనతో కలిసి పనిచేయడం లేదు. అసలు సింగిల్ గానే ముందుకెళుతున్నారు. కానీ ఈ మధ్య చంద్రబాబు-పవన్..తెలంగాణలో బీజేపీని గెలిపించడానికి సహకరిస్తారని ప్రచారం జరుగుతుంది. అధికారికంగా పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయని కథనాలు వచ్చాయి. కానీ ఇందులో వాస్తవం లేదని తెలంగాణ బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు.

ఇటీవల రాజ్యసభ ఎంపీ కే.లక్ష్మణ్.. పొత్తుల గురించి క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో కలిసి పనిచేసే ఆలోచన లేదని.. అలాగే ఏపీలో జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ టీడీపీతో పొత్తు లేదని చెబుతూనే. .తెలంగాణలో జనసేనతో కూడా పొత్తు లేదని క్లారిటీ ఇచ్చేశారు. అంటే తెలంగాణలో సింగిల్ గానే బీజేపీ ముందుకెళుతుంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ జాతీయ పార్టీగా మారుస్తున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్‌గా మారుస్తున్నారు. జాతీయ పార్టీగా మారక..ఆ పార్టీతో పవన్ పొత్తు పెట్టుకుంటారని కథనాలు వస్తున్నాయి.

తెలంగాణలో బీఆర్ఎస్‌తో జనసేన కలిసి పనిచేయనుందని విశ్లేషకులు అంటున్నారు. ఎలాగో తెలంగాణ బీజేపీ నేతలు..పవన్‌ని పెద్దగా లెక్క చేయడం లేదు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో కూడా పవన్..టీఆర్ఎస్‌కు మద్ధతు ఇచ్చారు. అప్పుడు పవన్‌పై బీజేపీ నేతలు ఘాటుగానే విమర్శలు చేశారు. ఇప్పటికీ కూడా పవన్ అవసరం తమకు లేదన్నట్లే మాట్లాడుతున్నారు. అయితే కేసీఆర్ జాతీయ పార్టీకి ఇతర పార్టీల మద్ధతు అవసరం.. అందుకే పవన్ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. కాకపోతే ఏపీలో బీజేపీతో కలిసి పవన్ పనిచేస్తున్నారు..కాబట్టి తెలంగాణలో పరోక్షంగా కేసీఆర్‌కు సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version