నకిలీ స్కిన్ హెయిర్ డాక్టర్ ని అరెస్ట్ చేసారు. బట్టతలపై వెంట్రుకలు రప్పిస్తానంటూ ట్రీట్మెంట్ చేసారు అస్లాం. చర్మ రోగాల నివారణ కి ట్రీట్మెంట్ అంటూ ప్రచారం చేసారు. గచ్చిబౌలిలో క్లినిక్ ఓపెన్ చేసి, ట్రీట్మెంట్ చేస్తున్నారు ఈ నకిలీ డాక్టర్. ఇతను యూపీ నుంచి వచ్చి హైదరాబాదు లో రెండుచోట్ల క్లినిక్లు ఓపెన్ చేసారు.
హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తాం అని మోసాలకు అస్లాం పాల్పడుతున్నారు. అస్లాం దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్లకు ఉపయోగం లేక పోగా సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు అస్లామీ ని అరెస్ట్ చేసారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ నకిలీ డాక్టర్ ను అదుపు లోకి తీసుకున్నారు.