చెవుల గురించి మైండ్‌బ్లోయింగ్‌ ఫ్యాక్ట్స్‌.. మెదడు కంటే షార్ప్‌ తెలుసా.?

-

మీ శరీరం గురించి మీకు ఎంత తెలుసు.. శరీరంలో ఉండే అవయవాలు ఎన్ని, అవి ఎందుకు ఎలా పనిచేస్తాయో మాత్రమే తెలుసు. కానీ మీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. అవి భలే గమ్మత్తుగా ఉంటాయి. మనిషి శరీరం ఒక పెద్ద మాయాజాలం. మీరు ఊహించలేరు కూడా! అసలు ఇలా ఎలా నిర్మితమవుతుందో.. నిజంగా దేవుడ్ని మించిన సైంటిస్ట్‌, ఇంజనీర్‌ లేరు.! మనిషికి రెండు చెవులు ఉంటాయి, వాటిని క్లీన్‌గా ఉంచుకోవాలి అప్పుడే బాగా వినపడుతుంది అని ఎవరైనా చెప్తారు. కానీ చెవుల గురించి మీకు తెలియని ఇంట్రస్టింగ్‌ మ్యాటర్స్‌ ఇంకా ఉన్నాయిగా..! అవేంటంటే..

Ears: Facts, Function & Disease | Live Science

చెవి చాలా సున్నితంగా ఉన్నప్పటికీ, చెవిలోపల గట్టి ఎముక ఉందని కొందరికే తెలుసు. ఈ ఎముక మన లోపలి చెవిని రక్షిస్తుంది. మరియు మన శరీరంలో అతి చిన్న ఎముక చెవి. మధ్య చెవిలోని స్టేప్స్, లేదా “స్టిరప్” ఎముక, ఒసికిల్స్‌లో భాగంగా ఉంటుంది. మరియు ఇది మనిషి శరీరంలోనే అతి చిన్న ఎముక

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చెవులు ఎల్లప్పుడూ పనిచేస్తాయి. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన చెవులు పనిచేస్తూనే ఉంటాయి. నిద్రపోయేటప్పుడు, మెదడు మన చుట్టూ ఉన్న శబ్దాలను కూడా పట్టించుకోదు. కానీ ఏదైనా అనుకోని శబ్దాలు వచ్చినప్పుడు చెవులు వింటాయి.

Understanding how the ear works - Hearing Link Services

టిన్నిటస్ చాలా సాధారణం. కానీ శబ్దం ఎక్కువగా ఉంటే అది వినికిడి లోపం కలిగిస్తుంది. అలాగే చెవుల్లోని దుమ్ము, ధూళిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. ఇది చెవిని కాపాడుతుంది.

పెద్ద శబ్దం వల్ల కొందరిలో వినికిడి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వారు కొన్ని రకాల ఆహారంతో ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల చెవిలోని రక్తనాళాలు బలపడతాయి. అలాగే పాలకూర వంటి ఆకు కూరలు తీసుకోవడం వల్ల వినికిడి లోపం తగ్గుతుంది.

మనం మన ఎడమ వైపు నుండి సంగీతాన్ని బాగా వింటాము. సైన్స్ మ్యాగజైన్‌లో ప్రచురించబడిన కాలిఫోర్నియా మరియు అరిజోనా విశ్వవిద్యాలయాల అధ్యయనం ప్రకారం , మన కుడి చెవి పుట్టినప్పటి నుండి ప్రసంగానికి ఎక్కువ ప్రతిస్పందిస్తుంది, అయితే ఎడమ వైపు నిరంతర స్వరాలు మరియు సంగీత శబ్దాలకు ఎక్కువ గ్రహణశీలత ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news