తెలంగాణలో నకిలీ వైద్యుల కలకలం.. 11 మంది అరెస్టు

-

రాష్ట్రంలో నకిలీ వైద్యుల సేవలు ఒక్కసారిగా కలకలం సృష్టించాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తెలంగాణ వైద్య మండలి అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించగా 11 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. బుధవారం వారిపై టీజీఎంసీ కేసులు నమోదు చేసింది.

వివరాల్లోకివెళితే.. నిజామాబాద్, కామారెడ్డిలో ఇటీవల తెలంగాణ వైద్య మండలి అధికారులు విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు. అధికారుల బృందం నిర్వహించిన తనిఖీల్లో ఎటువంటి మెడికల్ క్వాలిఫికేషన్స్ లేకున్నా, వైద్య విద్య అర్హతలు లేకున్నా కొందరు డాక్టర్లుగా చెలామణి అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో 11 మంది నకిలీ ఆర్ఎంపీ, పీఎంపీలను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు.డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నలుగురు నకిలీ వైద్యులను రిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news