స్కై డైవ్ చేస్తూ కేసీఆర్ పై అభిమానం చాటిన ఎన్నారై..వీడియో వైరల్

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలకు హైదరాబాద్‌ మహానగరం సర్వం సిద్ధమైంది. ప్రజా నాయకుడి జన్మదినం సందర్భంగా యావత్‌ ప్రజానీకం పులకించిపోతున్నది. జననేతకు పుట్టినరోజు కానుక ఇచ్చేందుకు సబ్బండ వర్ణాలు కదం తొక్కుతున్నాయి. కేక్‌ కటింగ్‌లతోపాటు మొక్కలు నాటడం.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు నాయకులు, పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు.

సామాన్య ప్రజానీకం సైతం భాగస్వామ్యులై వాడవాడల్లో పండుగలా పుట్టినరోజు వేడుకలను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు రోజుల ముందే సంబురాలు మొదలవ్వడంతో హైదరాబాద్‌ మహా నగరం గులాబీమయమైంది. ఇది ఇలా ఉండగా, తెలంగాణ ఎన్నారై.. సీఎం పుట్టిన రోజు నేపథ్యంలో.. వినూత్న ప్రదర్శన చేశాడు. స్కై డైవ్ చేస్తూ సీఎం కేసీఆర్ పై బీఆర్ఎస్ పై తన అభిమానం చాటాడు ఈ తెలంగాణ ఎన్నారై. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version