బోధన్ పాస్ పోర్ట్ స్కాం.. 500కి పైగా ఫేక్ పాస్ పోర్టులు ?

-

నిజామాబాద్ జిల్లా బోధన్ లో వెలుగుచూసిన ఫేక్ అడ్రస్ లో పాస్పోర్ట్ కేసు చివరి దశకు చేరింది. అరెస్టయిన పోలీసు అధికారులతో జారీ అయిన పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేస్తున్నారు పోలీసులు. బోధన్ లో ఒక్కో పాస్పోర్ట్ జారీ చేసేందుకు కాను దాదాపు 15 వేల రూపాయలు వసూలు చేసినట్లుగా నిర్ధారణ అయింది. మీసేవ, ఆధార్ సెంటర్ నిర్వాహకులకి ఇప్పుడు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఇక బోధన్ లో ఇలా తప్పుడు అడ్రస్ ల తో దాదాపు 500కు పైగా పాస్ పోర్టులు పొందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ దొంగ పాస్ పోర్టులతో ఇతర దేశాలకు వెళ్లిన వారిపై కూడా లుకవుట్ నోటీసులు జారీ చేసేందుకు ఉన్నతాధికారులకు లేఖలు రాసినట్లు చెబుతున్నారు. అంతేగాక తప్పుడు చిరునామాతో పొందిన అన్ని పాస్ పోర్టులు రద్దు చేయాలని సిఫార్సు లేఖలు కూడా రాసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version