Fact check: తస్మాత్ జాగ్రత్త.. ఈ అపాయింట్మెంట్ లెటర్లని నమ్మకండి… వట్టి మోసమే..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది అంతే కాకుండా ఉద్యోగాలను కూడా నిరుద్యోగులకి ఇస్తోంది. అయితే తాజాగా ఒక వార్త వచ్చింది. అపాయింట్మెంట్ లెటర్ల గురించి ఆ వార్త లో ఉంది. మరి నిజంగా అపాయింట్మెంట్ లెటర్లని ఆత్మ నిర్బర్ భారత రోజ్గర్ యోజన కింద ఇస్తోంది..? కేంద్ర ప్రభుత్వం కి ఈ అపాయింట్మెంట్ లెటర్ల కి సంబంధం ఉందా..? వీటిని నమ్మొచ్చా..? ఉద్యోగంలో చేరొచ్చా.. ఈ విషయంలో నిజం ఎంత అనే విషయాన్ని ఇప్పుడే తెలుసుకుందాం..

ఈరోజుల్లో అనేక నకిలీ వార్తలు వస్తున్నాయి చాలామంది నకిలీ వార్తలని నిజం అని భావిస్తున్నారు. నిజం అనుకుని నమ్మి మోసపోతున్నారు. స్కీముల పేరు తో ఉద్యోగాలు అని చెప్పి ఎంతగానో మోసం చేస్తున్నారు. ఎన్నో నకిలీ వార్తలు ఈ మధ్య సోషల్ మీడియాలో తరచు మనకి కనబడుతున్నాయి. ఇటువంటి వార్తలని చాలా మంది గుడ్డిగా నమ్మి అనవసరంగా ఇతరులకు పంపిస్తూ ఉంటారు.

ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గర్ యోజన కింద అపాయింట్మెంట్ లెటర్లని జారీ చేస్తున్నారు. అయితే ఇవి వట్టి నకిలీ లెటర్లు మాత్రమే. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అని ఫేక్ లెటర్ లని ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గర్ యోజన కింద జారీ చేస్తున్నారు పైగా ఇందుకోసం రూ.4,950 ని వసూలు చేస్తున్నారు. ఈ ఫేక్ లెటర్ లని అనవసరంగా నమ్మి మోసపోకండి ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే లేబర్ మినిస్టరీ ఇటువంటి లెటర్లని జారీ చేయలేదు. పీఐబి ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది కాబట్టి ఇటువంటి వార్తలు నమ్మద్దు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version