మొబైల్ లాక్కున్న టీచర్​పై పెప్పర్ స్ప్రే చల్లిన స్టూడెంట్.. వీడియో వైరల్

-

నేటి జనరేషన్​కు మొబైల్ ఫోన్ జీవితంలో భాగమైపోయింది. ఒక పూట తిండి తినకుండా అయినా ఉంటారు కానీ.. చేతిలో క్షణం మొబైల్ లేకపోతే భరించలేరు. ఇక ఆ ఫోన్​ రిపేర్ అవ్వడమో.. పోవడమో.. ఇలా ఏదైనా కారణంతో తమ చేతిలో నుంచి మాయమైతే అప్పుడు చూడాలి వారి బాధ. రెక్కలు తెగిన పక్షిలా గిలగిలా కొంటుకుంటారు. ఇక ఎవరైనా తమ ఫోన్​ను చేతిలో నుంచి లాక్కుంటే వారితో గొడవ పడుతుంటారు. అయితే స్నేహితులో.. కుటుంబ సభ్యులతోనో ఈ విషయంలో గొడవ పడటం కామన్. కానీ ఓ విద్యార్థిని ఏకంగా తన ఫోన్ లాక్కున్నారని టీచర్​పై దాడికి దిగింది.

అమెరికాలో ఓ హై స్కూల్ విద్యార్ధిని టీచ‌ర్‌పై పెప్ప‌ర్ స్ప్రేతో అటాక్ చేసింది. ఈ ఘ‌ట‌న టెన్నిస్సిలోని నాష్‌విల్లేలో ఉన్న ఆంటియాక్ హై స్కూల్‌లో జ‌రిగింది. క్లాసురూంలో ఫోన్ వాడుతున్నందుకు.. విద్యార్ధిని నుంచి టీచ‌ర్ ఫోన్ లాక్కున్నారు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆ విద్యార్థిని టీచర్​ వెనకే వెళ్లింది. ఎంతకీ తన మొబైల్ ఇవ్వకపోవడంతో అతడిపై పెప్పర్ స్ప్రే చేసి తన మొబైల్ తీసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version