ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది బలగం మూవీ. స్టార్ హీరో కాస్టింగ్ భారీ బడ్జెట్ ఏవీ అవసరం లేకుండా సినిమాకు కథ మాత్రమే ప్రాణం అంటూ నిరూపించిన బలగం మూవీ హిట్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారి తీసింది కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనుకోని విజయాన్ని సాధించింది.
అయితే, ఈ ‘బలగం’ సినిమా మరో రెండు అవార్డులను సొంతం చేసుకుంది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాకు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడు విభాగంలో… ప్రియదర్శి, ఉత్తమ సహాయ నటుడు విభాగంలో… కేతిరి సుధాకర్ కు అవార్డులు వచ్చాయి. కాగా, ఇదివరకే పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న ఈ సినిమాకు వేణు వెల్దండి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.