మాజీ మంత్రి నారాయణను వరుసగా మూడో రోజు పోలీసులు గృహనిర్బంధం చేశారు. నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు మాజీమంత్రికి నోటీసులు అందజేశారు. ఎట్టి పరిస్థితులలోనూ ఇల్లు కదలడానికి వీలులేదని సూచించారు. ఇంటి చుట్టూ పోలీసులు మోహరించి శాంతి భద్రతలను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. మూడు రోజులుగా టీడీపీ నేతలను గృహ నిర్బంధంలో ఉంచారని.. ఐనా ప్రజలు బంద్ కి సహకరిస్తున్నారని తెలిపారు. 2021 లో లేని పేరును ఇప్పుడు తీసుకువచ్చారని మండిపడ్డారు నారాయణ.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికలలో వాల్లే బుద్ధి చెబుతారని అన్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ తో టిడిపి బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కి జనసేన పార్టీతోపాటు వామపక్షాలు మద్దతు పలికాయి. బంద్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి, జనసేన, వామపక్షాల నేతలు రోడ్డెక్కారు. దీంతో పోలీసులు పలు ప్రాంతాలలో ఆందోళనకారులను అరెస్టు చేస్తున్నారు.