విచారణ జరుపుతుంటే సినిమా తీస్తారా..!

-

ఎప్పుడు వివాదాస్పద సినిమాలతో సరికొత్త వివాదాలను సృష్టించే రామ్ గోపాల్ వర్మ… తన సినిమాలతో కొంతమందిని ఇబ్బందులకు గురిచేయడం మరికొంతమందిని అలరించడం చేస్తూ ఉంటారు. ఎన్ని విమర్శలు వచ్చినా చేయాలనుకున్నది చేస్తూ ముందుకు సాగుతుంటారు అనే విషయం తెలిసిందే. అందుకే రాంగోపాల్ వర్మను వివాదాస్పద దర్శకుడు అని తెలుగు ప్రేక్షకులు పిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే ఎన్నో వివాదాస్పద సినిమాలను తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ ఇటీవల… దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు.

దిశ ఎన్కౌంటర్ అని ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. అయితే ఈ సినిమాపై అటు కుటుంబ సభ్యులతో పాటు దిశ కేసులో నిందితుల కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చేయకుండా అడ్డుకుంటాము అంటూ హెచ్చరిస్తున్నారు. దిశ కేసులో నిందితుల కుటుంబ సభ్యులు మరోసారి సుప్రీం కోర్టు జ్యుడీషియల్ కమిషన్ను ఆశ్రయించారు. ఎలాగైనా దిశ ఎన్కౌంటర్ సినిమాని తెరకెక్కించకుండా అడ్డుకోవాలని కోరారు. విచారణ జరుగుతున్న సమయంలో సినిమా తీయడం సరి కాదు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు దిశ కేసు నిందితుల కుటుంబ సభ్యులు.

Read more RELATED
Recommended to you

Latest news