మన దేశంలో రోజు రోజుకు టీ తాగే వారి సంఖ్య పెరిగుతూ వస్తుంది.దేశంలోని ప్రతి ఇద్దరిలో ఒకరు టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు ఉంటున్నారు..దీన్ని చాలామంది బిజినెస్ గా మార్చుకుంటూన్నారు.టీ ప్రియులను ఆకర్షించడానికి రకరకాల టీలను తయారు చేస్తున్నారు.టీని పాలతో తయారు చేసినప్పటికి అందులో అల్లం, యాలకులు, తేనే, పుదినా ఆకులు ఇతర దినుసులు వేస్తూ అనేక రకాల పేర్లతో మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇదంతా రొటీన్‌గా ఉందని ఢిల్లీకి చెందిన ఓ యువకుడు కొత్త రకం టీని కనిపెట్టాడు. ఇందులో అతను కనిపెట్టింది తాగే టీని కాదు తినే టీని..ఇదేంటి టీ ద్రవ పదార్థం కదా ఎలా తింటారు అనే సందేహం రావొచ్చు..
మీరు విన్నది అక్షరాల నిజం..ఢిల్లీలో టీ తాగిన గ్లాసును పడేయకుండా తినేయవచ్చు. ఇప్పుడు దేశ రాజధానిలో ఈ రకం టీలకు డిమాండ్ బాగా పెరిగింది..కొత్త వెరైటీ టీలు తయారు చేస్తున్నారు. ఉత్తర ఢిల్లీలోని అతిపెద్ద నివాస కాలనీ రోహిణిలోని శివచౌక్ చాలా ప్రసిద్ధి చెందింది. కొత్త టీ సెంటర్‌ను ఇక్కడ ప్రారంభించారు. ‘ఇష్క్-ఎ-చాయ్’ పేరుతో తోపుడు బండిపై ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌లో రెగ్యులర్‌గా దొరికే అన్నీ టీలు ఉంటాయి..
అల్లం, ఏలకులతో కూడిన బలమైన టీతో పాటు బటర్ స్కాచ్, రోజ్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్‌తో కూడిన టీ ఉంటుంది. అయితే వీటన్నింటికంటే వెరైటీ టీని కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అదేమిటంటే కుల్హద్ అంటే కోన్ ఐస్‌క్రీంను తయారు చేసే బిస్కెట్‌లో పెట్టే విధంగా టీని కూడా అలాంటి తినదగిన పదార్ధంతో గ్లాసుగా తయారు చేసి అందులో టీ పోసి ఇస్తారు. అయితే ఢిల్లీ లాంటి రాజధాని నగరంలో ఇప్పుడు తాగే టీ కాకుండా తినదగిన టీని స్టార్టప్‌గా ఎంచుకొని బాగా పాపులర్ అయ్యాడు ఒకసారి సెలెబ్రేటి అయ్యాడని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..
ఇకపోతే ఈ గ్లాసుల్లో టీ పోసిన తర్వాత 20నిమిషాల తర్వాత కలిగిపోతుంది. కాబట్టి టీ తాగిన వెంటనే గ్లాస్‌ను తినేయవచ్చు..మసాలా టీని 10 రూపాయలు, ఆ తర్వాత తినదగిన గ్లాసుల్లో టీ కావాలంటే 15,20రూపాయల ధరల్లో సైజులు పెంచుకుంటూ టీని అమ్ముతున్నాడు.అదే విధంగా ప్లెయిన్ కాఫీ 25 రూపాయలు, ఫిల్టర్ కాఫీ 30 రూపాయల చొప్పున విక్రయిస్తున్నాడు..దీంతొ టీకి అక్కడ డిమాండ్ కూడా భారీగా పెరిగింది.